Chinmayi Sripada: చిత్ర పరిశ్రమపై సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన వ్యాఖ్యలు

Singer Chinmayi on abuse in film industry
షార్ట్స్‌లో చూడండి
చిత్ర పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’పై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా హేమ కమిటీ నివేదికపై స్పందించారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై నియమించిన ఈ కమిటీ ఇటీవల కేరళ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై చిన్మయి ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. సినీ పరిశ్రమలో పరిస్థితి గురించి, నేరస్తులకు ఉన్న రాజకీయ అనుబంధాల గురించి విడమరిచి చెప్పారు. 

హేమ కమిటీలోని సభ్యులు, విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్లూసీసీ) సభ్యులకు సింగర్ హ్యాట్సాఫ్ చెప్పారు. సినీ పరిశ్రమకు చెడ్డ పేరు వచ్చిందని, ఇక్కడ లైంగిక వేధింపులు సర్వసాధారణం అని చాలామంది విశ్వసిస్తారని చెప్పారు. తమిళ పాటల రచయిత వైరముత్తు నుంచి తాను స్వయంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, ఆ కేసులో తాను పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. చాలా చిత్ర పరిశ్రమల్లో నేరస్తులు కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. ఆమె దీనిని ‘అధికారం, రాజకీయాలు, డబ్బు బంధం‘గా అభివర్ణించారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులతో రాజకీయ సంబంధాలు నేరస్తులకు శిక్ష పడకుండా అడ్డుకుంటున్నాయని అన్నారు. 

మనం ఓ సమస్య గురించి ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. కేసు సంవత్సరాలు, దశాబ్దాలపాటు సాగుతుందన్నారు. తాను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు చెప్పారు. ఏడేళ్లు అయినా ఆ కేసు ఎక్కడుందో ఇప్పటికీ తనకు తెలియదని వాపోయారు. ‘‘నేను వేధింపులకు గురయ్యానని చెప్పాను. ఇండస్ట్రీలో ఇక నిన్ను పనిచేయనివ్వబోమని వారు చెప్పారు’’ అని చిన్మయి చెప్పుకొచ్చారు. అధికారం, రాజకీయాలు, డబ్బు పెనవేసుకుంటే జరిగేది ఇదేనని వివరించారు.
Go Back to Shorts
Chinmayi Sripada
Film Industry
Hema Committee

More Telugu News