మరికాసేపట్లో జైలు నుంచి పిన్నెల్లి విడుదల
- ఈవీఎం ధ్వంసం కేసులో జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే
- శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
- టైమ్ అయిపోవడంతో విడుదల చేయని నెల్లూరు జైలు అధికారులు
పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలింగ్ సిబ్బందిని బెదిరించడం, రక్షణ ఏర్పాట్లలో ఉన్న పోలీసులపై దాడి చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేసి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు పిన్నెల్లికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా ఆయన అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారించిన హైకోర్టు.. పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.