Madhapur: మాదాపూర్‌లో ఆన్‌లైన్ వ్యభిచారం.. 17 మంది విదేశీ యువతుల అరెస్ట్

17 Girls Arrested In Madhapur Hyderabad In Brothel Case
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా విటులను ఆకర్షించి, గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. ఓ వెబ్‌సైట్ ద్వారా బుకింగులు చేసి, తమ ఇంట్లోనే ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిర్వాహకుడు శివకుమార్‌తోపాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. 

అలాగే, వ్యభిచారం నిర్వహిస్తున్న 17 మంది విదేశీ యువతలను అదుపులోకి తీసుకుని సేఫ్ హౌస్‌కు తరలించారు. నిందితుడి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, 25 హెచ్ఐవీ పరీక్ష కిట్లు, హుక్కా పాట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Madhapur
Hyderabad
Crime News

More Telugu News