Nepal Bus Accident: నేపాల్‌లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. అందులో 40 మంది భారతీయులు.. వీడియో ఇదిగో!

Nepal Bus Accident Vehicle From India With 40 Passengers Falls Into River
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు టనహూన్ జిల్లాలో మర్స్యంగడి నదిలోకి దూసుకెళ్లింది. బస్సు పోఖరా నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సుకు యూపీ నంబర్ ప్లేట్ ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Nepal Bus Accident
Indians
Uttar Pradesh
Tanahun
Marsyangdi River

More Telugu News