అనకాపల్లి జిల్లాలో మరో ఫార్మా ప్రమాదం .. నలుగురు కార్మికులకు గాయాలు
- పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదం
- నలుగురు కార్మికులకు గాయాలు
- ఒకరి పరిస్థితి విషమం
- ఘటనపై స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, ఇతర అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.