'ఆహా' తెరపైకి కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ!

Shakhahaari Movie OTT Release date confirmed
  • కన్నడలో హిట్ కొట్టిన 'శాకాహారి'
  • ప్రధానమైన పాత్రను పోషించిన రంగయన రఘు 
  • మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • ఈ నెల 24వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్

కన్నడలో ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితాలో 'శాకాహారి' ఒకటిగా కనిపిస్తుంది. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 16వ తేదీన విడుదలైంది. రంగాయన రఘు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్ ను .. వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మే 22వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. 

ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే .. హరిణి శ్రీకాంత్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మయూరి అంబేకల్లు అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించింది. 

అది అడవిని ఆనుకుని ఉన్న ఒక కొండ ప్రాంతం. అక్కడ చిన్నపాటి హోటల్ పెట్టుకుని సుబ్బన్న జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒక రోజున తీవ్రంగా గాయపడి తన హోటల్ కి వచ్చిన వ్యక్తికి సుబ్బన్న ఆశ్రయమిస్తాడు. ఆ వ్యక్తి ఒక హత్యచేసి అక్కడికి వచ్చాడనే విషయం తెలిసి సుబ్బన్న కంగారుపడిపోతాడు. అక్కడి నుంచి అతణ్ణి పంపించేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అనుకోకుండా ఆ వ్యక్తి అక్కడ చనిపోతాడు. ఫలితంగా సుబ్బన్న ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనేది కథ.

Go Back to Shorts
Rangayana Raghu
Vinay
Harini
Gopalakrishna Desh Pandey

More Telugu News