పార్టీ జెండాను ఆవిష్కరించిన స్టార్ హీరో విజయ్
- తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించిన విజయ్
- చెన్నైలో పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్
- కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారుల హాజరు
ఎరుపు, పసుపు రంగుల్లో జెండా ఉంది. జెండా మధ్యలో సూర్యకిరణాలు, పక్కనే రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. మరోవైపు, పార్టీ జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు అభిమానులు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.