ఏపీలో సీబీఐ విచారణకు అనుమతినిస్తూ గెజిట్ విడుదల
- 2014-19 మధ్య కాలంలో సీబీఐకి ఏపీలో నో చెప్పిన టీడీపీ సర్కారు
- మళ్లీ ఇప్పుడు సీబీఐకి అనుమతి ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్
- సీబీఐ విచారణ పరిధి పెంపు
ఏపీలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు, పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థాపక చట్టం-1946లోని సెక్షన్-3 ప్రకారం సీబీఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజా గెజిట్ లో పేర్కొంది. తద్వారా సీబీఐ పరిధిలో నిర్దేశించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర సర్కారు లాంఛనంగా అనుమతినిచ్చినట్టయింది.
2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వమే అనుమతి నిరాకరించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం గమనార్హం.