Report: మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేసే మహిళల పరిస్థితులపై సంచలన నివేదిక

Report revealed on women situations in Malayalam film industry
  • 2019లో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటు
  • ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వైనం
  • సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలు వెలుగులోకి!
మలయాళ చిత్ర  పరిశ్రమలో  పనిచేసే మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన సంచలన  నివేదికలోని అంశాలు వెల్లడయ్యాయి. మలయాళ చిత్ర పరిశ్రమను మాఫియా నడిపిస్తోందని నివేదికలో పేర్కొన్నారు. 

మలయాళ చిత్ర పరిశ్రమలో చాలామంది మహిళలు లైంగిక వేధింపుల బారినపడ్డారని, అయితే తమ భవిష్యత్ పట్ల భయంతో వారు పోలీసులను ఆశ్రయించలేదని తెలిపారు. తమకు నచ్చిన విధంగా నడుచుకునేందుకు అంగీకరించిన మహిళలకు కొన్ని కోడ్ లు ఇచ్చేవారని, తమ ప్రతిపాదనలకు అంగీకరించిన వారికి అవకాశాలు రాకుండా చేసేవారని జస్టిస్ హేమ కమిటీ నివేదికలో వివరించారు.

లైంగిక అవసరాలు తీర్చితేనే మహిళలకు సినీ అవకాశాలు లభిస్తాయన్న కఠోర వాస్తవాన్ని తాము గుర్తించామని నివేదికలో స్పష్టం చేశారు. బాధితులు చెప్పే విషయాలు దిగ్భ్రాంతి కలిగించాయని పేర్కొన్నారు. 

2017లో ఓ మలయాళ నటి (భావన) కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించడం తెలిసిందే. కదులుతున్న కారులతో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మలయాళ నటుడు దిలీప్ పై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో 2019లో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ నివేదిక సమర్పించినప్పటికీ, అందులోని వివరాలు బయటికి రాలేదు. తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా, అందులోని వివరాలు బహిర్గతం అయ్యాయి.
Report
Women
Malayalam Film Industry
Justice Hema Committee
Kerala

More Telugu News