రాఖీ పండుగ సందర్భంగా వినేశ్ ఫొగాట్‌కు రూ.500 నోట్ల కట్టను ఇచ్చిన సోదరుడు
- తన సోదరుడి జీవితకాల సంపాదన ఇచ్చాడన్న వినేశ్ ఫొగాట్
- జీవితాంతం ఇంత డబ్బు సంపాదించాడంటూ సరదాగా వ్యాఖ్య
- నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
ఈ రక్షా బంధన్‌కు తన సోదరుడి నుంచి ఫొగాట్‌కు ఓ గిఫ్ట్ అందింది. తన సోదరుడి జీవితకాల సంపాదన తనకు ఇచ్చాడని వినేశ్ ఫొగాట్ మురిసిపోయారు. రూ.500 నోట్లతో కూడిన కట్టను తన సోదరుడు తనకు ఇచ్చాడని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
"నాకు దాదాపు 30 ఏళ్లు. గడిచిన ఏడాది నాకు రూ.500 ఇచ్చాడు (సోదరుడు). ఆ తర్వాత ఇది (కరెన్సీ నోట్ల కట్టను చూపుతూ) ఇచ్చాడు. అతను తన జీవితాంతం (హాస్యంగా) ఇంత డబ్బు సంపాదించాడు" అంటూ పేర్కొన్నారు.