Komatireddy Venkat Reddy: అనాథకు అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి

Komatireddy sent one rs 1 lakh to orphan girl
  • తల్లిదండ్రులను కోల్పోయిన నిర్మల్ జిల్లాకు చెందిన దుర్గ
  • రూ. లక్ష సాయం చేసిన కోమటిరెడ్డి
  • ఇంటిని కూడా సమకూరుస్తానని హామీ
అనాథగా మారిన చిన్నారి దుర్గకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. నిర్మల్ జిల్లాలోని తానూర్ మండలం బెల్ తారోడాకు చెందిన దుర్గ తల్లిదండ్రులను కోల్పోయింది. దుర్గకు తమ ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ. లక్ష సాయం చేశారు. ఈ నగదును స్థానిక అధికారుల చేత దుర్గకు అందజేశారు. దుర్గ చదువు పూర్తయ్యేంత వరకు ఆమెకు అండగా ఉంటానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. చిన్నారికి ఇల్లు కూడా సమకూరుస్తానని చెప్పారు. ఖర్చులకు ప్రతి నెల డబ్బులు పంపుతానని తెలిపారు. త్వరలోనే కలుస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బాలికకు వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు.
Komatireddy Venkat Reddy
Congress

More Telugu News