ప్రత్యేక చట్టాన్ని తీసుకురండి.. కోల్‌కతా హత్యాచార ఘటనపై ప్రధానికి పద్మ అవార్డు గ్రహీతల లేఖ
- వైద్యులపై జరుగుతున్న హింసాత్మక దాడులకు అడ్డుకట్ట వేసేలా చట్టాన్ని తీసుకురావాలని అభ్యర్థన
- ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరిన పద్మశ్రీలు
- సాధ్యమైనంత త్వరగా పరిష్కారాన్ని వెతకాలని విజ్ఞప్తి
వైద్య రంగంలో పనిచేస్తున్న వారిపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చట్టాన్ని సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని కోరారు. హాస్పిటల్స్‌లో మెరుగైన భద్రతా నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కోరారు. మహిళలు, చిన్నారులు, వైద్య సిబ్బందిపై జరుగుతోన్న దాడులు, హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.