ముంబై ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి
- ముఖంపై గాయాలతో మద్యం మత్తులో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి
- చికిత్స చేస్తున్న వైద్యురాలిపై తిట్ల దండకం
- ఆదివారం తెల్లవారుజామున ఘటన
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత వైద్యురాలు
అసలేం జరిగిందంటే..
ముంబైలోని సియోన్ ఆసుపత్రికి ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ముఖంపై గాయాలతో రక్తమోడుతూ వచ్చాడు. ఆయనతో ఐదారుగురు వ్యక్తులు తోడుగా వచ్చారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. వార్డులో విధులు నిర్వర్తిస్తున్న రెసిడెంట్ డాక్టర్ ఈ పేషెంట్ ను అటెండ్ అయ్యారు. గాయాలకు చికిత్స చేస్తుండగా పేషెంట్ తిట్లదండకం మొదలు పెట్టాడు. ఆపై మహిళా వైద్యురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యురాలికి గాయాలయ్యాయి. వైద్యురాలి కేకలతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా నిందితులు అందరూ పారిపోయారు. ఈ ఘటనపై బాధిత డాక్టర్ సియోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.