జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2
- 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన
- ఉత్తమ జాతీయ నటుడిగా రిషబ్ శెట్టి
- ఉత్తమ నటిగా నిత్య మీనన్
ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా 'కార్తికేయ-2' ఎంపికయింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు. నిఖిల్ హీరోగా 2014లో వచ్చిన కార్తికేయ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే.
దానికి సీక్వెల్ గా 2022లో వచ్చిన కార్తికేయ-2 చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల దుమ్ము దులిపింది. నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి కలయికలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్ ఇతర పాత్రలు పోషించారు.