నారా లోకేశ్ కార్యక్రమంలో డ్రోన్ కలకలం... పోలీసుల అదుపులో ఏఎస్సై కుమార్తె!
- గుంటూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న లోకేశ్
- కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా డ్రోన్ సంచారం
- డ్రోన్ ఎగురవేసిన యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పోలీసుల విచారణలో తన పేరు నందిని అని ఆమె తెలిపింది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి ఏఎస్సై శ్రీనివాసరావు కుమార్తెనని వెల్లడించింది. తాను యూట్యూబర్ అని... గతంలో కూడా అనేక కార్యక్రమాలను ఇలాగే చిత్రీకరించానని చెప్పింది. అయితే, అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడంతో... ఆ డ్రోన్ ను పోలీసులు సీజ్ చేశారు.