నడి రోడ్డు మీద ట్రంప్, మస్క్ అదిరిపోయే డాన్స్.. ఏఐ వీడియో ఇదిగో!
- అమెరికా సెనేటర్ వీడియో ట్వీట్ ను రీట్వీట్ చేసిన మస్క్
- మా డ్యాన్స్ ఎలా ఉందంటూ ఫాలోవర్లకు ప్రశ్న
- ఏఐ వల్ల నిజమేదో అవాస్తవమేదో తెలయడం లేదంటున్న నెటిజన్లు
తొలుత ఈ వీడియోను అమెరికాలోని యుటా సెనేటర్ మైక్ లీ ట్వీట్ చేయగా.. ఎలాన్ మస్క్ దీనిని రీట్వీట్ చేశారు. మా డ్యాన్స్ ఎలా ఉందంటూ తన ఫాలోవర్లను సరదాగా ప్రశ్నించాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఏకంగా 6.5 కోట్ల మంది ఈ వీడియోను చూడగా 3.5 వేల మంది రీట్వీట్ చేశారు. కొందరేమో వీడియో ఫన్నీగా ఉందని కామెంట్లు పెట్టగా మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ఈ వీడియో ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చిపెడుతుందని ఓ యూజర్ అభిప్రాయపడ్డాడు. తాను ఇప్పటి వరకు చూసిన వీడియోల్లో బెస్ట్ వీడియో ఇదేనని మరో యూజర్ చెప్పాడు. ఇక మరొక యూజర్ మాత్రం కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చాక నిజమేదో.. అవాస్తవమేదో తెలుసుకోలేక పోతున్నామని వాపోయాడు.