Train Accident: మేడ్చల్ జిల్లాలో ఘోరం... రైలుకింద పడి తండ్రీ, ఇద్దరు కూతుళ్లు మృతి

Three dead in Medhcal Malkajgiri district
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం దారుణం జరిగింది. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న రైల్వే లైన్‌మెన్ కృష్ణ డ్యూటీకి వెళుతున్నాడు. తన వెంట ఇద్దరు కూతుళ్లనూ తీసుకెళ్లాడు.

వారు వెళ్తుండగా రైలు ఢీకొని ముగ్గురు అక్కడికి అక్కడే చనిపోయారు. విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
Train Accident
Medchal Malkajgiri District
Telangana

More Telugu News