Anand Mahindra: వావ్‌... 99 ఏళ్ల వ‌య‌సులోనూ ఈత‌... ఆనంద్ మ‌హీంద్రా ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

Anand Mahindra another Interesting Tweet on Betty Brussel


సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, మ‌హీంద్రా సంస్థ‌ల అధినేత ఆనంద్ మ‌హీంద్రా తాజాగా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌రో ఆస‌క్తిక‌ర వీడియోను పంచుకున్నారు. 99 ఏళ్ల వ‌య‌సులోనూ ఉత్సాహంగా ఈత కొడుతున్న కెన‌డా బామ్మ బెట్టి బ్ర‌స్సెల్ వీడియోను మ‌హీంద్రా షేర్ చేశారు. 

"పారిస్ ఒలింపిక్స్ లో యువ క్రీడాకారుల స‌త్తా చూశాం. కానీ 99 ఏళ్ల బెట్టి బ్ర‌స్సెల్ ఇంకా పోటీ ప‌డుతున్నారు. జీవితాంతం ఒలింపిక్ స్థాయి మ‌న‌సు ఉండ‌టం అవ‌స‌ర‌మ‌ని ఆవిడ వీడియో మ‌న‌కు గుర్తు చేస్తోంది" అని మ‌హీంద్రా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, బెట్టీ బామ్మ ఈ ఏడాది ప్రారంభంలో జ‌రిగిన వృద్ధుల‌ ఈత‌ల పోటీల్లో ఒకేరోజు మూడు రికార్డుల్ని బ‌ద్ద‌లుకొట్టారు.

Anand Mahindra
Betty Brussel
Twitter
  • Loading...

More Telugu News