జగన్ మాటలకు జనాలు నవ్వుకుంటున్నారు: గోనె ప్రకాశ్‌రావు
- ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలనే జగన్ డిమాండ్ నవ్వు తెప్పిస్తోందన్న మాజీ ఎమ్మెల్యే
- రాష్ట్రపతి పాలన అసాధ్యమన్న గోనె ప్రకాశ్‌రావు
- ఇటీవల సీఎం చంద్రబాబుతో భేటీపై కూడా స్పందన
- ప్రస్తుతం తాను ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నట్లు వెల్లడి
ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావడంపై కూడా గోనె ప్రకాశ్ రావు స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా చంద్రబాబును మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని తెలిపారు. ఎలాంటి రాజకీయ పదవులు ఆశించి ఏపీ సీఎంను కలవలేదన్నారు. ప్రస్తుతం తాను ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నానని చెప్పిన ఆయన... చనిపోయేంత వరకు అందులోనే ఉంటానని చెప్పుకొచ్చారు.