మాల్దీవుల అధ్యక్షుడితో కేంద్రమంత్రి జైశంకర్ భేటీ
- మూడు రోజుల పర్యటన నిమిత్తం మాల్దీవులకు వెళ్లిన జైశంకర్
- రేపటి వరకు మాల్దీవుల్లోనే జైశంకర్
- సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని వెల్లడి
రేపటి వరకు మాల్దీవుల్లోనే ఉండనున్న జైశంకర్ ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. జైశంకర్ చివరిసారి 2023 జనవరిలో ఆ దేశంలో పర్యటించారు. ఆ తర్వాత ముయిజ్జు ఈ ఏడాది జూన్‌లో మన దేశంలో పర్యటించారు.
మాల్దీవుల ప్రధానితో భేటీకి సంబంధించిన ఫొటోను జైశంకర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అధ్యక్షుడితో భేటీ కావడం విశేషమన్నారు. భారత ప్రజలు, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం భారత్-మాల్దీవుల సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ముయిజ్జు మాట్లాడుతూ... భారత్ తమకు ఎప్పుడూ మిత్రదేశమే అన్నారు. తమకు అవసరం వచ్చినప్పుడల్లా సహాయాన్ని అందిస్తుందని గుర్తు చేసుకున్నారు.