Jr NTR: ఎన్‌టీఆర్‌-ప్ర‌శాంత్ నీల్ మూవీ లాంఛ్‌.. స్టైలిష్ లుక్‌లో ద‌ర్శ‌నమిచ్చిన తార‌క్‌!

Prashant Neel and NTR Combination New Movie Launching Today
షార్ట్స్‌లో చూడండి
క‌న్న‌డ‌ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, హీరో ఎన్‌టీఆర్‌ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న మూవీ ఓపెనింగ్ కార్య‌క్ర‌మం హైదరాబాద్‌లో జ‌రిగింది. ఇవాళ‌ పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్ లో ఈ ప్రారంభ‌ వేడుక జరిగింది. ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. తార‌క్‌ స్టైలిష్ లుక్‌లో ద‌ర్శ‌నమిచ్చారు.   

ప్రస్తుతం ఈ మూవీ ఓపెనింగ్ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. #ఎన్‌టీఆర్‌నీల్‌ హ్యష్‌ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. 'ఎన్‌టీఆర్ 31' వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కనున్న ఈ చిత్రం ఈ నెల‌లోనే సెట్స్ పైకి వెళ్లనున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీని ప్ర‌ముఖ తెలుగు నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.
Go Back to Shorts
Jr NTR
Prashanth Neel
Tollywood

More Telugu News