వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటనపై స్పందించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు

WFI President Sanjay Singh blames support staff
  • సోషల్ మీడియా ద్వారా ఫొగాట్ నిర్ణయం తెలిసిందన్న సంజయ్ సింగ్
  • రిటైర్మెంట్ ప్రకటన తమను షాక్‌కు గురి చేసిందని వెల్లడి
  • ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం వద్దని సూచన
వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటనపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందించారు. ఫొగాట్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. ఆమె తనంతట తానుగా రిటైర్ కావాలని నిర్ణయించుకోవడం తమను షాక్‌కు గురి చేసిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం వద్దని తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చాక సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పారు.

ఈ విషయమై వినేశ్ ఫోగాట్ తో మాట్లాడుతామన్నారు. ఒలింపిక్స్‌లో ఫొగాట్ అధిక బరువు ఉండటంపై సంజయ్ సింగ్ ఆమె సహాయక సిబ్బందిపై మండిపడ్డారు. ఇందులో వినేశ్ ఫొగాట్ పొరపాటు ఏమీ లేదన్నారు. ఆమెకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఫిజియో, పోషకాహార నిపుణుడితో సహా కోచ్, ఇతర సహాయక సిబ్బంది చూసుకోవాల్సిందన్నారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Vinesh Phogat
Sports News

More Telugu News