షాద్ నగర్ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
- షాద్ నగర్ ఘటనపై డిప్యూటి సీఎం భట్టితో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
- దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు చెప్పిన ఉన్నతాధికారులు
- సీఐతో పాటు ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
డిప్యూటి సీఎం భట్టి ఆదేశాలతో సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి వెంటనే చర్యలు చేపట్టారు. ఒక సీఐ సహా ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ అవినాశ్ మహంతి. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో షాద్ నగర్ వంటి సంఘటనలను సహించబోమని డిప్యూటి సీఎం భట్టి .. పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి వైద్య సహాయంతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని సంబంధిత అధికారుల ద్వారా డిప్యూటి సీఎం భట్టి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన పోలీస్ అధికారులకు ఆయన సూచించారు.