BL Santosh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన బీఎల్ సంతోష్

BL Santosh met Gosha Mahal MLA Raja Singh in Hyderabad

  • హైదరాబాద్ విచ్చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
  • రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాలపై ఆరా
  • 8 ఎంపీ స్థానాలు గెలవడం బీజేపీకి శుభసంకేతమని వెల్లడి

బీజేపీ వ్యవస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నేడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాలపై ఆరా తీశారు. పార్టీ జాతీయ నాయకత్వం నిర్దేశించిన కార్యక్రమాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. 

అంతకుముందు, బీఎల్ సంతోష్ హైదరాబాదులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాలు గెలవడం శుభసంకేతమని, పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుపోవాలని పేర్కొన్నారు. 

పార్టీ బలహీనంగా ఉన్నచోట మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నందన, వాటిపై దృష్టి  సారించాలని, గ్రామాల్లోనూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీఎల్ సంతోష్ స్పష్టం చేశారు.

More Telugu News