నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చంద్రబాబు .. ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వినతుల స్వీకరణ
- నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్న సీఎం చంద్రబాబు
- గ్రీవెన్స్ కార్యక్రమానికి అనూహ్య స్పందన
- సమస్యల పరిష్కారం కోసం విన్నవించుకోనున్న బాధితులు
- నామినేటెడ్ పదవుల కోసం నాయకుల వినతులు
ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి అనూహ్య స్పందన కనబడుతోంది. అయితే వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయంలో తనే స్వయంగా అందుబాటులో ఉండి ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో భాగంగా నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి పార్టీ శ్రేణులకు చంద్రబాబు అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి బాధితులు, ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవిస్తుండగా, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు పలువురు నామినేటెడ్ పదవుల కోసం అభ్యర్థనలు అందజేస్తున్నారు.