KTR: రాహుల్, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వస్తే యువత తన్ని తరిమేస్తుంది: కేటీఆర్

KTR hot comments on Rahul Gandhi and Revanth Reddy
  • జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని విమర్శ
  • ఈ అంశంపై చర్చించేందుకు సమయం అడిగితే ఇవ్వలేదన్న కేటీఆర్
  • నాలుగు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అన్నారని విమర్శ
జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్‌కు వస్తే యువత తన్ని తరిమేస్తుందన్నారు. 

జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్యను వెల్లడించలేదంటూ అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... జాబ్ క్యాలెండర్ పై చర్చించాలని అడిగితే అసెంబ్లీలో కనీసం రెండు నిమిషాల సమయం ఇవ్వలేదన్నారు.

నాలుగు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అనడం దారుణమన్నారు. శాసనసభ దుశ్శాసన సభగా మారిందని చురక అంటించారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేసిందన్నారు.

జాబ్ క్యాలెండర్ అన్నారు... రాహుల్ గాంధీ ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు... కానీ రేవంత్ రెడ్డి ఇచ్చింది కొన్ని ఉద్యోగాలేనని విమర్శించారు. యువతను మభ్యపెట్టి ఎక్కువరోజులు ప్రభుత్వాన్ని నడపలేరని హెచ్చరించారు. 

కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అంతా బోగస్ అన్నారు. తాము యువత తరఫున పోరాడుతుంటే తిడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వ్యక్తికి మైక్ ఇచ్చి తిట్టించారని మండిపడ్డారు.

More Telugu News

KTR
Revanth Reddy
Rahul Gandhi
Congress