రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
- ఇంద్-భారత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ దివాలా ప్రక్రియ కేసు
- రఘురామకృష్ణరాజు ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్‌బీఐ ప్రొసీడింగ్స్
- వాటిని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఈ కేసులో ప్రతివాదులైన రిజర్వు బ్యాంక్, ఎస్‌బీఐలకు నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. అలాగే, ఇంద్-భారత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ డైరెక్టర్ కె.సీతారామం ఖాతాను కూడా మే 28న ఇలాగే మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్‌బీఐ ప్రొసీడింగ్స్ జారీచేసింది. తాజాగా, ఆయనకు కూడా ఊరట కల్పిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.