కొత్త పార్లమెంటు భవనంలో వాటర్ లీక్.. నీరు పడుతున్న చోట బకెట్.. వీడియో ఇదిగో!
- ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు
- ప్రాణాలు కోల్పోయిన 9 మంది
- పార్లమెంట్ లాబీలో వర్షం నీరు లీక్
- బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్ అంటూ కాంగ్రెస్ విమర్శలు
మరోవైపు వర్షాల కారణంగా కొత్త పార్లమెంటు భవనం లాబీలో నీరు లీక్ అవుతోంది. ఏడాది క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ భవనంలో ఇప్పుడు నీరు లీక్ కావడంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. నీరు లీక్ అవుతున్న చోట బకెట్ పెట్టి ఉన్న వీడియోను కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ఎక్స్ ఖతాలో షేర్ చేశారు. ‘బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన కొత్త భవనంలో సమస్యలను ఇది బయటపెట్టింది. దీనిపై పార్లమెంట్లో వాయిదా తీర్మానం ప్రవేశపెడతా’ అని మాణికం ఠాగూర్ రాసుకొచ్చారు.