నిఫ్టీ @25,000.. చరిత్రలో తొలిసారి మైలురాయి
నిఫ్టీ-50 సూచీలో మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, కోల్ ఇండియా, టాటా మోటార్స్ అత్యధికంగా లాభాపడిన స్టాకుల జాబితాలో ఉన్నాయి. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా అత్యధికంగా నష్టపోయిన స్టాకులుగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి..
6 నెలల్లో 15 శాతం పెరిగిన నిఫ్టీ
గత ఆరు నెలల్లో నిఫ్టీ సూచీ 15 శాతానికి పైగా వృద్ధి చెందింది. ఇదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 14 శాతానికి పైగా ర్యాలీ అయింది. జులై 23న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం పరుగులు పెడుతున్నాయి.