రెచ్చిపోయిన పోకిరీలు.. భర్తతో బైక్‌పై వెళుతున్న మహిళకు వేధింపులు.. వీడియో ఇదిగో!
- ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘటన
- వరద నీరు నిలిచిన రోడ్డు మీద బైక్‌పై వెళుతున్న దంపతులకు దారుణ అనుభవం
- దంపతులను చుట్టుముట్టి ఆకతాయిల వేధింపులు
- మహిళపై రోడ్డుమీదున్న నీటిని దోసిళ్లతో ఎత్తిపోసి వికృతానందం
ఈ ఉదంతం నెట్టింట పెనుకలకలానికి దారి తీసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ మహిళపై ఆమె భర్త ముందే అల్లరి మూకలు రెచ్చిపోయిన తీరు అనేక మందిని ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.