Dhuliapall Vydeepthi: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె

Dhulipalla Narendra daughter Vydeepthi counters Chevireddy tweet

  • పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  • అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
  • తాము చేసే ప్రజాపోరాటాలు ఎలా ఉంటాయో చూపిస్తామన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
  • మీ ప్రభుత్వ హయాంలో చాలామంది ఇదే బాధను అనుభవించారన్న వైదీప్తి 

పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో పోలీసులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని 41ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టడం తెలిసిందే. దీనిపై చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 

"నా కొడుకు వయసు 25 ఏళ్లు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడు. కానీ అక్రమ కేసులో అరెస్ట్ చేయించారు. తద్వారా, విదేశాల్లో చదివిన నా కొడుకును వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు... చంద్రబాబుకు కృతజ్ఞతలు. నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగిన వాడ్ని. నన్ను మించి నా కొడుకు ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు చేస్తే ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు రుచి చూపించడం ఖాయం. ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం" అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్వీట్ చేశారు. 

అయితే, ఈ ట్వీట్ పై పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె ధూళిపాళ్ల వైదీప్తి  స్పందించారు. 

"మూడేళ్ల కిందట... నాకు 23 ఏళ్ల వయసున్నప్పుడు... నేను అమెరికాలో చదువుకుంటున్నాను. ఆ సమయంలో మా నాన్న ధూళిపాళ్ల నరేంద్రను మీ పార్టీ ప్రతీకార రాజకీయాల వల్ల అన్యాయంగా అరెస్ట్ చేశారు. మన విలువను నిరూపించుకోవడానికి విదేశీ డిగ్రీలు చూపించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ చదువుతున్నాం అనేది కాదు... మనం ఎటువంటి విలువలు పాటిస్తున్నాం అనేది ముఖ్యం. గత ప్రభుత్వ హయాంలో మాలాంటి వాళ్లం చాలా మంది ఎంత బాధను అనుభవించామో మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను" అంటూ ధూళిపాళ్ల వైదీప్తి కౌంటర్ ఇచ్చారు.

Dhuliapall Vydeepthi
Dhulipalla Narendra Kumar
Chevireddy Bhaskar Reddy
Chevireddy Mohith Reddy
TDP
YSRCP
  • Loading...

More Telugu News