Revanth Reddy: రేవంత్ రెడ్డి సహా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన సీఎంలు వీరే!

CMs of INDIA alliance will not go to NITI Aayog meeting
  • కేంద్రబడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ నిరసనగా సమావేశం బహిష్కరణ
  • సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు
  • ఇండియా కూటమిలోని స్టాలిన్, భగవంత్ మాన్, విజయన్ కూడా గైర్హాజరు
నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ బహిష్కరించారు. కేంద్రబడ్జెట్‌లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ.. అందుకు నిరసనగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.

సమావేశాన్ని బహిష్కరించిన వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ గైర్హాజరయ్యారు. అలాగే, ఇండియా కూటమి ముఖ్యమంత్రులు స్టాలిన్ (తమిళనాడు), పినరయి విజయన్ (కేరళ), భగవంత్ మాన్(పంజాబ్) గైర్హాజరయ్యారు.
Revanth Reddy
Congress
Niti Aayog

More Telugu News