Tirupati: ఇంటికొచ్చిన స్నేహితురాలిని భర్తతో అత్యాచారం చేయించిన లా విద్యార్థిని!

Law student raped by co student husband and blackmailed
  • తిరుపతి జిల్లాలో ఘటన
  • లా విద్యార్థినిని మత్తులో దించిన దంపతులు
  • భర్త అరాచకానికి పాల్పడుతుంటే భార్య సహకారం
  • వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్
  • నిందితులు ఇద్దరూ న్యాయ విద్య అభ్యసిస్తున్న వారే
  • బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కటకటాల్లోకి 
స్నేహితురాలని నమ్మి ఇంటికొచ్చిన యువతికి గంజాయిని అలవాటు చేయడమే కాక, భర్త అఘాయిత్యానికి పాల్పడుతుంటే సహకరించింది. ఆపై ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసింది. బాధితురాలు, నిందితులు ఇద్దరూ కూడా న్యాయవిద్య అభ్యసిస్తుండడం గమనార్హం. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

పోలీసుల కథనం ప్రకారం కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి (22) నాలుగేళ్ల క్రితం తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ కోర్సులో చేరింది. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న క్రమంలో పుదిపట్లలో ఉండే సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణ (35)తో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఆమె ఇంటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణ కిశోర్‌తోనూ బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అతడు ఎస్వీయూ న్యాయ కళాశాలలో ఎల్ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

గంజాయికి బానిసలైన ప్రణవకృష్ణ, ఆమె భర్త కృష్ణకిశోర్ ఇద్దరూ తమ ఇంటికి వచ్చే యువతికి కూడా దానిని అలవాటు చేశారు. ఆమె ఆ మత్తులో ఉండగా కృష్ణ కిశోర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ప్రణవకృష్ణ తన ఫోన్‌లో వీడియో తీసింది. వాటితో బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేస్తూ బంగారం నగలు లాక్కున్నారు. అక్కడితో ఆగక ఆ ఫొటోలు, వీడియోలను బాధిత యువతి సోదరుడు, ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన దంపతులిద్దరినీ అరెస్ట్ చేశారు. వారిద్దరినీ అధికారులు యూనివర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు.
Tirupati
Law Student
Andhra Pradesh
Ganja

More Telugu News