Konda Surekha: మంత్రి కొండా సురేఖను కలిసిన సినీ నటి రేణుదేశాయ్

Renu Desai meets Minister Konda Surekha
  • పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై వారిమధ్య చర్చ
  • గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రికి వివరించిన నటి
  • ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును రేణుదేశాయ్‌కి అలంకరించిన కూతురు సుస్మిత 
ప్రముఖ సినీనటి రేణుదేశాయ్ శుక్రవారం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. రేణుదేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్‌గా కూడా ఉన్నారు. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై వారి మధ్య చర్చ జరిగింది. 

భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణుదేశాయ్ మంత్రికి వివరించారు.

గొలుసును రేణుదేశాయ్‌కి అలంకరించిన సుష్మిత

తమ ఇంటికి  వచ్చిన రేణుదేశాయ్‌ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి రేణు దేశాయ్‌కి తన స్వహస్తాలతో అలంకరించారు. కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 
Konda Surekha
Renu Desai
Telangana
Tollywood

More Telugu News