పార్లమెంట్లో మొదటిసారి మాట్లాడిన బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్
- హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ కళారూపాలపై కంగన ప్రసంగం
- గిరిజనుల జానపద సంగీతం అంతరించిపోతోందంటూ ఎంపీ ఆవేదన
- పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలపై సభలో మాట్లాడాలన్న బాలీవుడ్ నటి
ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో జానపద సంగీతం కూడా అంతరించిపోయే పరిస్థితిలో ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్పితి, కిన్నౌర్, భర్మోర్ గిరిజన జానపద సంగీతాలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయని తాను చెప్పదలచుకున్నానని అన్నారామె. జానపద సంగీత పునరుజ్జీవానికి తామంతా ఏం చేస్తున్నామో మాట్లాడాలని ఆమె అన్నారు.
ఈ మేరకు తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా షేర్ చేశారు. పార్లమెంటులో మాట్లాడే అవకాశం కల్పించిన స్పీకర్ ఓం బిర్లాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్లో ఆమె హిందీలో మాట్లాడారు.