Nara Lokesh: బీజేపీలోకి వైసీపీ నేతలు?: లోకేశ్ ఛాంబర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలతో ఆసక్తికర చర్చ

TDP asks bjp leaders about ycp leaders joinings
  • కాఫీ తాగుదామంటూ బీజేపీ ఎమ్మెల్యేలను తన ఛాంబర్‌కు తీసుకెళ్లిన లోకేశ్
  • బీజేపీలోకి తోట త్రిమూర్తులు వస్తున్నారనే ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్యే ఆరా
  • అలాంటిదేమీ లేదని స్పష్టం చేసిన మంత్రి సత్యకుమార్
  • కూటమి నిర్ణయాల కోసం కమిటీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్న బీజేపీ ఎమ్మెల్యేలు
  • ఈ నిర్ణయం బాగుందన్న లోకేశ్
శాసన సభలో సోమవారం గవర్నర్ ప్రసంగం ముగిశాక మంత్రి నారా లోకేశ్ బీజేపీ ఎమ్మెల్యేలను పలకరించారు. కాఫీ తాగుదామంటూ వారిని తన ఛాంబర్‌లోకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బీజేపీలో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది నిజమేనా? అంటూ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి... బీజేపీ ఎమ్మెల్యేలను అడిగారు. తనకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.

కొందరు వైసీపీ నాయకులు బీజేపీలో చేరుతారనే చర్చ సాగుతోంది. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు అడిగారు. వైసీపీ నుంచి ఎవరైనా పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే కూటమి పక్షాల నేతలు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటే మంచిదని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

అలాగే, మూడు పార్టీలు సమన్వయంతో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన బీజేపీ ఎమ్మెల్యేల నుంచి వచ్చింది. ఈ ఆలోచన బాగుందని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే పాలన సజావుగా సాగేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
Nara Lokesh
BJP
Telugudesam
Andhra Pradesh

More Telugu News