Kodali Nani: వైసీపీ నేత కొడాలి నాని మాజీ పీఏపై రాత్రిపూట దాడి

Kodali Nani former PA attacked in Gudiwada
  • ప్రస్తుతం మచిలీపట్నం కలెక్టరేట్‌లో పని చేస్తోన్న మాజీ పీఏ
  • గుడివాడలో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • తనపై దాడి చేసిందెవరో తెలియదన్న లక్ష్మోజీ
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ పీఏ ఆచంట లక్ష్మోజీపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం కలెక్టరేట్‌లో పౌరసరఫరాల విభాగంలో పని చేస్తున్నాడు. నిన్న విధులు ముగించుకుని రైలులో గుడివాడకు వచ్చాడు. స్టేషన్ పక్కనే ఉన్న తన బైక్‌ను తీస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. 

తనపై దాడి చేసింది ఎవరో తనకు తెలియదని చెబుతున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరకుండా ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు. అతనిపై దాడికి వ్యక్తిగత కారణాలా? లేక రాజకీయ కక్షలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. దాడి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే గుడివాడ చేరుకుని... సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
Kodali Nani
Attack
Andhra Pradesh

More Telugu News