Team India: వైట్ బాల్ సిరీస్ ల కోసం శ్రీలంక చేరుకున్న టీమిండియా

Team India arrives in Sri Lanka for white ball cricket
  • జులై 27 నుంచి శ్రీలంకలో టీమిండియా టూర్
  • 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న టీమిండియా
  • కోచ్ గా ప్రస్థానం ప్రారంభించనున్న గంభీర్
వైట్ బాల్ సిరీస్ ల కోసం టీమిండియా నేడు శ్రీలంక చేరుకుంది. జులై 27న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20 మ్యాచ్ లు, 3 వన్డేలు ఆడనుంది. 

ఈ మధ్యాహ్నం భారత్ నుంచి బయల్దేరిన టీమిండియా ఈ సాయంత్రం శ్రీలంకలోని పల్లెకెలే చేరుకుంది. టీమిండియా ఆటగాళ్లకు విమానాశ్రయంలో సంప్రదాయ స్వాగతం లభించింది. అక్కడ్నించి ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో నేరుగా తమకు కేటాయించిన హోటల్ కు చేరుకున్నారు. 

టీమిండియా ఆటగాళ్లు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో రేపటి నుంచి ప్రాక్టీస్ షురూ చేయనున్నారు.

ఈ సిరీస్ లో టీ20 సిరీస్ లో ఆడే టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వన్డేల్లో రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. 

టీ20 సిరీస్ కు టీమిండియా ఇదే...
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

వన్డే సిరీస్ కు టీమిండియా ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Team India
Sri Lanka
White Ball Cricket

More Telugu News