Bandaru Dattatreya: చంద్రబాబును కలిసిన బండారు దత్తాత్రేయ

Bandaru Dattatreya meets chandrababu
  • ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా కలిసిన హర్యానా గవర్నర్
  • దత్తాత్రేయకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికిన ఏపీ సీఎం
  • వెంకటేశ్వరస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. ఏపీ సీఎంను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దత్తాత్రేయకు చంద్రబాబు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికి, శాలువా కప్పి సన్మానించారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం దత్తాత్రేయ ఏపీ సీఎంను శాలువాతో సన్మానించారు. అనంతరం కాసేపు ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు.
Bandaru Dattatreya
Chandrababu
Andhra Pradesh
Telangana

More Telugu News