Nadendla Manohar: అసెంబ్లీలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్ నియామకం

Nadendla Manohar elected as Janasena Party deputy floor leader in AP Assembly
ఏపీ అసెంబ్లీలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక అసెంబ్లీలో పార్టీ చీఫ్ విప్ గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమాచారం అందించారు.
Nadendla Manohar
Deputy Floor Leader
AP Assembly
Janasena
Andhra Pradesh

More Telugu News