AI Fashion Show: మోదీ ర్యాంప్ వాక్ చేస్తే ఎలా వుంటుందంటే.. వీడియో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్

PM Modi And World Leaders Walk The Ramp In Elon Musks AI Fashion Show
  • కృత్రిమ టెక్నాలజీ సాయంతో ఎలాన్ మస్క్ ఫ్యాషన్ షో
  • ఒబామా, పుతిన్, కమలా హారిస్, ట్రూడో, బైడెన్, ట్రంప్ తదితరులతో ర్యాంప్ వాక్
  • కండలు చూపిస్తూ స్పేస్ సూట్ లో ఎలాన్ మస్క్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
నిత్యం వివిధ పనులతో బిజీబిజీగా గడిపే దేశాధినేతలు సరదాగా ర్యాంప్ వాక్ చేస్తే.. ఇది జరిగేపనేనా అని అనుకోవడం సహజమే. అయితే, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, కృత్రిమ మేధతో అసాధ్యమైన విషయం ఏముంటుంది? నేతల ర్యాంప్ వాక్ వీడియోను ఇట్టే తయారుచేసిచ్చింది. ఈ వీడియోను ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒంటినిండా దుస్తులు, నల్ల కళ్లజోడు, నుదుటన కుంకుమ బొట్టుతో స్టైలిష్ గా కనిపించారు. హుందాగా నేను నడిచొస్తే అన్న రేంజ్ లో చిరునవ్వులు విసురుతూ ర్యాంప్ పై నడిచారు. తరచూ తన చేష్టలతో నవ్వు తెప్పించే డొనాల్డ్ ట్రంప్ ను ఏఐ మరింత ఫన్నీగా మార్చేసింది. ఖైదీలు ధరించే యూనిఫాంలో చేతుల్లో బేడీలు, సీరియస్ లుక్ తో ట్రంప్ ర్యాంప్ ను అదరగొట్టారు. మహిళల దుస్తులతో పుతిన్, ట్రూడో, ఆర్మీ యూనిఫాంలో వీల్ ఛైర్ లో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, బికినీని తలపించే డ్రెస్ లో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు.

బరాక్ ఒబామాను మాత్రం రంగు రంగుల దుస్తుల్లో, రాజుల కాలం నాటి సైనిక వేషధారణలో.. ఇలా రకరకాల కాస్ట్యూమ్ తో ర్యాంప్ పై నడిపించారు. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ కూడా ర్యాంప్ పై సందడి చేశారు. ఒళ్లంతా చూపించి, ఆపై స్పేస్ సూట్ ను ధరించిన ఎలాన్ మస్క్ ఠీవీగా నడిచారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలిగిన సంగతిని చూపిస్తూ ఆ సంస్థ అధినేత బిల్ గేట్స్ చేతిలో ఓ మానిటర్ ను పెట్టి మస్క్ ర్యాంప్ వాక్ చేయించారు.
AI Fashion Show
Elon Musk
PM Modi
Viral Videos
Offbeat

More Telugu News