Chandrababu: మంగళగిరిలో గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

CM Chandrababu attends Guru Pournami celebrations on Mangalagiri

  • నేడు గురుపౌర్ణమి
  • మంగళగిరిలో రామదూత స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు
  • వేణు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం, పాదుకా పూజ నిర్వహించిన చంద్రబాబు

ఇవాళ దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి పర్వదినం జరుపుకుంటున్నారు. మంగళగిరిలో నిర్వహించిన గురుపూర్ణిమ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపౌర్ణమి ఉత్సవంలో పాల్గొన్న చంద్రబాబు... ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేణు దత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుకాపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును రామదూత స్వామి ఆశీర్వదించారు. 

అంతకుముందు, చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేదవ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు.

Chandrababu
Guru Pournami
Mangalagiri
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News