ఉజ్జయినిలోని హోటల్ యజమానుల నేమ్ ప్లేట్ తప్పనిసరి
- ఆదేశాలు జారీ చేసిన ఉజ్జయిని మేయర్
- ఉల్లంఘిస్తే భారీ జరిమానా, హోటల్, స్టాల్ ల తొలగింపు
- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల బాటలో మధ్యప్రదేశ్ నిర్ణయం
ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో యాత్ర సాగే మార్గాల్లోని హోటళ్లు, తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. కన్వర్ యాత్ర సాగే మార్గంలో పలువురు హిందూయేతరులు హిందూ పేర్లతో షాపులు నిర్వహిస్తున్నారని, భక్తులకు మాంసాహారంతో చేసిన పదార్థాలను విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదే బాటలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా ఆదేశాలు జారీ చేసింది.