జగన్ తప్పుడు మాటలకు ఎవరూ భయపడరు: మంత్రి అనగాని సత్యప్రసాద్
- ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేపడుతున్న వైసీపీ
- ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని జాతీయస్థాయిలో తెలియజేస్తామన్న జగన్
- ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళతారంటూ నిలదీసిన మంత్రి అనగాని
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్త చంద్రయ్యను హత్య చేశారని, జగన్ పాలనలో ఎన్నో హత్యలు జరిగాయని ఆరోపించారు. జగన్ సవ్యంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు. జగన్ తప్పుడు మాటలకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని అణచివేస్తామని పేర్కొన్నారు.