Suman: నాతో యాక్ట్ చేయనని ఏ హీరోయిన్ చెప్పలేదు : హీరో సుమన్

Suman Interview
షార్ట్స్‌లో చూడండి
సుమన్ .. హీరోగా ఒకానొక సమయంలో ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను గట్టి పోటీ ఇచ్చారు. యాక్షన్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నారు. హీరో అంటే సుమన్ లా ఉండాలని అనిపించుకున్నారు. ఇక భక్తి చిత్రాలలో భగవంతుడిగా కూడా ఆయన ప్రేక్షకులను అలరించారు. ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 

అలాంటి సుమన్ ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."మొదటి నుంచి కూడా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అందుకే నన్ను మోసం చేసినవాళ్లను నేనేమీ అనలేదు. నన్ను అలా చేసిన వాళ్లలో కొంతమంది ఇప్పుడు లేరు. ఉన్నవాళ్ల కుటుంబాలు ఎవరూ సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లని నేను మనసులో కూడా తిట్టుకోలేదు. కర్మను ఎవరూ తప్పించుకోలేరు అంతే. వాళ్లను అలా చూడటానికి నాకూ బాధగానే అనిపిస్తూ ఉంటుంది" అని అన్నారు. 

" నా నిర్మాతలు .. నా దర్శకులు .. నన్ను రిపీట్ చేశారు. ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్లు నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు. ఇక హీరోయిన్స్ లో విజయశాంతి .. భానుప్రియ నాతో ఎక్కువ సినిమాలు చేశారు. నేను స్క్రీన్ పైనే తప్ప ఏ హీరోయిన్ తోను ప్రేమలో పడలేదు. ట్రాక్ మారిపోతే కెరియర్ దెబ్బతింటుందని నాకు తెలుసు. అందువలన నా లిమిట్ లో నేను ఉండేవాడిని. అందువల్లనే నాతో చేయడానికి హీరోయిన్స్ కి కంఫర్ట్ గా ఉండేది. ఈ కారణంగానే నాతో చేయనని ఏ హీరోయిన్ ఎప్పుడూ చెప్పలేదు" అని అన్నారు. 

Go Back to Shorts
Suman
Vijayashanthi
Bhanupriya

More Telugu News