KTR: బస్సు ఛార్జీలు పెంచుతారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్

Congress counter to KTR comments on Bus fare hike
  • మీ తండ్రి ప్రతి పథకంలో ఫ్రీ అంటూ మోచేయి నాకించాడని విమర్శ
  • అలాంటి పదేళ్ల పాలనను పదేపదే ఎందుకు గుర్తు చేస్తావని ఎద్దేవా
  • దళిత బంధు, బీసీ బంధు, పేదలకు డబుల్ బెడ్రూం... ఏమీ ఇవ్వలేదని వ్యాఖ్య
కర్ణాటక ఆర్టీసీ మాదిరి తెలంగాణ ఆర్టీసీలో ఛార్జీలు పెంచే రోజు ఎంతో దూరంలో లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. మీ తండ్రి ప్రతి పథకంలో ఫ్రీ అని చెప్పి అరచేతిలో బెల్లం పెట్టి... మోచేయి నాకించాడని విమర్శించారు. అలాంటి పదేళ్ల పాలనను పదేపదే ఎందుకు గుర్తు చేస్తావ్? అని ప్రశ్నించింది.

దళితులకు మూడెకరాల భూమి... బీసీ బంధు... రైతులకు 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీ... దళితబంధు... పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు... ఇలా ఎన్నో చెప్పి ఏమీ చేయలేదని పేర్కొంది. ఆ పదేళ్ల కేసీఆర్ పాలనను పదేపదే ఎందుకు గుర్తు చేస్తావ్ కేటీఆర్? అంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
KTR
Congress
Bus Fare

More Telugu News