Pawan Kalyan: మోదీ పక్కన నిల్చుని ఫొటో దిగాలని కోరుకోను... ఎందుకంటే...!: పవన్ కల్యాణ్

Pawan Kalyan interesting comments abaout Modi
  • జనసేన ప్రజాప్రతినిధులకు నేడు మంగళగిరిలో సన్మానం
  • హాజరైన జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • తాను మోదీ హృదయంలో ఉన్నానని వ్యాఖ్య 
ఇవాళ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన మొత్తం 21 మంది గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు. 

తాను నటించిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడనని, కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నానని తెలిపారు. 

ఇక, తాను ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో ఉన్నానని, ప్రత్యేకంగా ఆయన పక్కన నిల్చుని ఫొటో తీయించుకోవాలని కోరుకోనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎక్కడైనా మోదీని కలిస్తే 60 సెకన్ల కంటే ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడనని, ఆ స్థాయి వ్యక్తి ఎంతో బిజీగా ఉంటారని, అలాంటి వ్యక్తి సమయం వృథా చేయరాదని భావిస్తానని వెల్లడించారు. 

తన స్వార్థానికి తాను ఏమీ అడగనని, ఇప్పటివరకు ప్రధానిని ఏమీ అడగలేదని, కానీ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఇక అడుగుతానని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, విశాఖ రైల్వే జోన్ కావాలని, 20 లక్షల ఉద్యోగాలు కావాలని అడుగుతానని పవన్ వివరించారు. జననసే పార్టీలో చాలామంది పదవులు అడుగుతున్నారని, ఒక్క టీటీడీ చైర్మన్ పదవినే 50 మంది అడిగారని వెల్లడించారు.
Pawan Kalyan
Narendra Modi
Janasena
Andhra Pradesh

More Telugu News