ఎన్టీఆర్ జిల్లాలో క్వారీ ప్రమాదం.. బండరాళ్లు మీద పడడంతో ముగ్గురు కార్మికుల మృతి
- మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్న రెస్క్యూ బృందాలు
- కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం
- మృతులు ముగ్గురూ చెరువు మాధవరం వాసులుగా గుర్తింపు
డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా..
రోజులాగానే సోమవారం ఉదయం కొంతమంది కార్మికులు క్వారీలో డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా బండరాళ్లు వాళ్లపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. తోటి కార్మికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతులు ముగ్గురూ జి.కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.