ఆడియన్స్ అభిప్రాయాలకు స్పందన.. తగ్గిన ‘భారతీయుడు 2’ మూవీ నిడివి

Indian 2 Team cuts 20 minute scenes from movie
  • కమల హాసన్-శంకర్ కాంబినేషన్‌లో ‘భారతీయుడు 2’ మూవీ
  • మూడు గంటల నిడివిపై ప్రేక్షకుల అసహనం
  • 20 నిమిషాల సీన్లు కట్ చేసిన చిత్ర బృందం
  • 2.40 గంటల నిడివితో నిన్నటి నుంచే అందుబాటులోకి
కమల హాసన్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు-2’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. 1996లో విడుదలైన ‘భారతీయుడు’ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఇది. సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, బాబీసింహా, వివేక్, బ్రహ్మానందం తదితరులు నటించారు. 

ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా మేకింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ మరీ మూడు గంటల నిడివి ఉందంటూ సోషల్ మీడియాలో ఆడియన్స్ తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడియన్స్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న చిత్రబృందం దాదాపు 20 నిమిషాల నిడివిగల దృశ్యాలను తొలగించింది. దీంతో సినిమా నిడివి 2.40 గంటలకు తగ్గింది. ఇదే నిడివితో నిన్న సాయంత్రం నుంచే థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
Go Back to Shorts
Indian 2
Kamal Haasan
Shankar
Indian 2 Movie

More Telugu News