Trump Shooter: పక్కా ప్లాన్ తోనే ట్రంప్ పై దాడి.. వివరాలు వెల్లడించిన పోలీసులు

Video Of The Trump Shooter Shelter On A Building Roof
  • ముందే బిల్డింగ్ పైకి చేరుకుని ఓపిగ్గా వేచి ఉన్న దుండగుడు
  • ట్రంప్ సభాస్థలి స్పష్టంగా కనిపించేందుకు వీలుగా పొజిషన్
  • బట్లర్ యువకుడేనని వెల్లడించిన పోలీసులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి పక్కా ప్లాన్ తో, ముందస్తు ఏర్పాట్లతోనే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పెన్సిల్వేనియాలోని బట్లర్ లో ట్రంప్ సభాస్థలికి దగ్గర్లోని ఓ ఇంటిపై షూటర్ ముందే ఏర్పాట్లు చేసుకున్నాడని వివరించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన తర్వాత పోలీసులు కొన్ని వివరాలను బయటపెట్టారు. ఇంటిపైకి ఎక్కేందుకు షూటర్ ఓ నిచ్చెన అమర్చుకున్నాడని, ట్రంప్ రాకకు చాలా ముందుగానే పైకి చేరుకుని ఓపిగ్గా వెయిట్ చేశాడని వివరించారు. సభాస్థలి బాగా కనిపించేలా చూసుకుని పొజిషన్ తీసుకున్నట్లు తెలిపారు. ట్రంప్ పై కాల్పులు జరిపిన యువకుడి పేరు థామస్ మాథ్యూ క్రూక్ అని, వయసు 20 ఏళ్లు, స్థానికుడేనని గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వివరాలను దర్యాఫ్తు సంస్థలు ధ్రువీకరించలేదు. నిందితుడి పేరును కూడా వెల్లడించలేదు. కాగా, ఈ కాల్పుల ఘటనను పోలీసులు హత్యాయత్నంగానే దర్యాఫ్తు చేపట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారికంగా ప్రకటించింది.

ఏఆర్ -15 గన్ తో కాల్పులు..
ట్రంప్ పై కాల్పులకు దుండగుడు ఉపయోగించిన గన్ ఏఆర్- 15 అని సీక్రెట్ సర్వీస్ పోలీసులు గుర్తించారు. ఈ సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో 182 మీటర్ల దూరం నుంచి కాల్చినట్లు భద్రతా దళాలు నిర్ధారించాయి. సభావేదికకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైనుంచి మొత్తం ఆరు రౌండ్లు కాల్చాడని, అందులో ఒక బుల్లెట్ ట్రంప్ చెవిని గాయపరిచిందని వెల్లడించాయి.

కాల్పులకు ఉపయోగించిన గన్ ఇలాంటిదే..
Trump Shooter
America Ex President
Building Roof
Shooter
Murder Attempt

More Telugu News